Wednesday, April 24, 2024

జూలై లో ఆచార్య షూట్ స్టార్ట్ !!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. ఇక రాంచరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. మరోవైపు లాంగ్ గ్యాప్ తర్వాత చిరు సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ జూలై లో స్టార్ట్ చేయబోతున్నారట. ఈ విషయాన్ని స్వయంగా కొరటాల శివ ప్రకటించారు. ఇప్పటికే షూటింగ్ కి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని పరిస్థితి అనుకూలిస్తే జూలై నాటికి తిరిగి షూటింగ్ ప్రారంభించాలని భావిస్తున్నట్లు చెప్పారు. కొరటాల రిక్వెస్ట్ మేరకు చిరంజీవి కూడా సెట్స్ కి రావడానికి ఒప్పుకున్నాడట. ఈ సినిమాకు సంబంధించి 20 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందట. ఈ షూటింగ్ పూర్తయిన వెంటనే ఆచార్య విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement