Thursday, April 25, 2024

ఆచార్య లేటెస్ట్ అప్డేట్ !!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. అలాగే చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఇదిలా ఉండగా కరోనా కారణంగా వాయిదా పడిన షూటింగ్ లు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి.

ఇక ఆచార్య విషయానికి వస్తే జూలై 8 నుంచి షూటింగ్ ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఇంకా 12 రోజుల చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉందట. ఇందులో ఏడు రోజులపాటు రామ్ చరణ్ పాల్గొంటారట. ఓ యాక్షన్ సన్నివేశంతో పాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. షూటింగ్ పూర్తయిన తర్వాత రిలీజ్ డేట్ పై కూడా ఒక క్లారిటీ రాబోతుందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement