Thursday, April 25, 2024

ఆకాశం నీ హద్దురా సినిమాకు మళ్ళీ అవార్డులు

సుధా కొంగర దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం సూరరై పోట్రు. ఈ సినిమా తెలుగులో ఆకాశం నీ హద్దురా పేరుతో విడుదలైంది. కరోనా కారణంగా డైరెక్టుగా ఓటీటీ లో విడుదలైన ఈ సినిమాలో హీరోయిన్ గా అపర్ణ బాలమురలి నటించింది. ఎయిర్ డెక్కన్ అధినేత గోపీచంద్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ ను అందుకుంది. అయితే ఈ సినిమా విడుదల అయినప్పటి నుంచి కూడా రకరకాల అవార్డులను గెలుచుకుంది.

తాజాగా మరో రెండు ప్రతిష్టాత్మక అవార్డులను ఈ చిత్రం తన ఖాతాలో వేసుకుంది. షాంఘై ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ లో ప్రదర్శితం కావడమే కాకుండా ఆస్కార్‌ అవార్డ్స్‌ నామినేషన్స్‌ కోసం కూడా పరిశీలనకు వచ్చింది. 78వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులలో ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో ప్రదర్శించబడే పది భారతీయ చిత్రాలలో ఒకటిగా ఎంపికైంది. ప్రస్తుతం ఐఎండిబిలో 9.1 రేటింగ్ తో అత్యధిక రేటింగ్ పొందిన మూడవ చిత్రంగా నిలిచింది. ది షాషాంక్ రిడంప్షన్ (1994), గాడ్ ఫాదర్ (1972) మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement