Friday, April 19, 2024

ఆది కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్

ఆది సాయికుమార్ కెరీర్ ను ప్రారంభించి చాలా ఏళ్ల అవుతున్నా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. అయితే హిట్ ఫ్లాఫ్ లతో సంబంధంలేకుండా సినిమాలను మాత్రం చేస్తున్నాడు. కాగా తాజాగా ఆది సాయి కుమార్ కొత్త చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ఆర్ ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాలో ఆది తో రొమాన్స్ చేయనుంది.

ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు ప్రారంభం అయింది. ఈ సినిమాకు టీఎంకే అనే టైటిల్ ని పెట్టారు. ఈ సినిమాలో ఆది సాయికుమార్ మునుపెన్నడూ చూడని పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. కళ్యాణ్ జీ గోగన ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. సాయికార్తీక్ సంగీతం అందిస్తున్నారు. విజన్ సినిమా పతాకంపై నాగం తిరుపతి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సునీల్ పూర్ణ కూడా ఈ సినిమాలో కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement