Saturday, April 20, 2024

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి – టీజ‌ర్ రిలీజ్

హీరో సుధీర్ బాబు తాజా చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈ చిత్రాన్ని ఇంద్ర‌గంటి మోహ‌నకృష్ణ‌తో , సుధీర్ బాబు చేస్తోన్న మూడ‌వ చిత్రం ఇది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. సుధీర్ బాబు ఇందులో సినిమా డైరెక్టర్ గా .. కంటి డాక్టర్ గా కృతి శెట్టి కనిపించనున్నారనే విషయం ఈ టీజర్ వలన తెలుస్తోంది. ఆమెను తన సినిమాలో హీరోయిన్ గా ఒప్పించడానికి ఆయన తాపత్రయ పడటం ఈ టీజర్ లో చూపించారు. ఆయన అదే పనిగా తన చుట్టూ తిరుగుతూ ఉండటంతో, ఆయన సినిమాలో చేయడానికి ఆమె అంగీకరిస్తుంది. అయితే అందుకు ఒక షరతు పెడుతుంది. ఆ షరతు ఏమిటనే సస్పెన్స్ ను రేకెత్తిస్తూ కట్ చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది. బెంచ్ మార్క్ స్టూడియోస్ – మైత్రీ మూవీస్ వారు నిర్మిస్తున్నారు.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement