Friday, April 19, 2024

ఇలా… ఇలా అంటూ రాబోతున్న ‘తలైవి’

జయలలిత జీవిత కథ ఆధారంగా కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం తలైవి. ఏప్రిల్ 23న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇక జయలలిత పాత్ర పోషించిన కంగనా రనౌత్ ఉత్తమ నటిగా మూడోసారి జాతీయ అవార్డుకు ఎంపిక కావడంతో ఈ చిత్రం పై మరింత అంచనాలు పెరిగాయి. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. కాగా ఏప్రిల్ 2న ఈ సినిమాలోని ఇలా… ఇలా అనే పాటని విడుదల చేయబోతున్నారు.

సిరాశ్రీ రాసిన ఈ పాటకు జీవీ ప్రకాశ్ స్వరాలు అందించారు. సైంథవి ప్రకాశ్‌ ఈ పాటను పాడారు. ఇక ఈ చిత్రం లో ఎంజీఆర్ గా అరవింద స్వామి, కరుణానిధిగా నాజర్, జయలలిత తల్లి సంధ్యగా భాగ్యశ్రీ,, జానకీ రామచంద్రన్ గా మధుబాల ఈ చిత్రంలో నటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement