Friday, March 29, 2024

లంబోర్గిని లో ప్రభాస్ సోదరి రైడ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల లంబోర్గిని అవెంటేడర్ ఎస్ రోడ్ స్టర్స్ ఆరంజ్ ఎడిషన్ ను కొనుగోలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ కారు విలువ దాదాపు 6.5 కోట్ల రూపాయలు ఉంటుంది. కాగా ఈ కొత్త మోడల్ ను సొంతం చేసుకున్న రెండవ భారతీయుడిగా కూడా ప్రభాస్ రికార్డు కొట్టాడు.

ఇదిలా ఉండగా ప్రభాస్ అత్త శ్యామల తన ఇంస్టాగ్రామ్ లో తన కూతురు, ప్రభాస్ సోదరి ప్రసిద్ధ లంబోర్గిని లో జాలీ రైడ్ కి వెళ్తున్న వీడియోను పోస్ట్ చేశారు. ఇక ప్రభాస్ అభిమానులు ఆ వీడియోని చూసి సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement