Thursday, April 25, 2024

మహేష్ పిన్ని గా శిల్పాశెట్టి ?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే అనౌన్స్ మెంట్ తోనే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ శిల్పా శెట్టి కీలక పాత్రలో నటిస్తుందని…ఓ వార్త బయటకు వచ్చింది. కాగా శిల్ప పాత్రకు సంబంధించి ఓ అప్డేట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ సినిమాలో మహేష్ కు పిన్నిగా శిల్పాశెట్టి కనిపించబోతున్నాడట.

ఇక ఇటీవల కాలంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తన ప్రతి సినిమాలోనూ సీనియర్ హీరోయిన్స్ ని పెడుతూ వస్తున్నాడు. అత్తారింటికి దారేది లో నదియా, అజ్ఞాతవాసిలో ఖుష్బూ, అల వైకుంఠపురములో టబు… ఇప్పుడు శిల్పా శెట్టి. ఇక ఈ సినిమా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. గతంలో త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లో ఖలేజా, అతడు సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. మరో వైపు మహేష్ బాబు పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement