Wednesday, April 24, 2024

టిఎఫ్ఐలో సరికొత్త రికార్డ్.. రియ‌ల్ “గేమ్ చేంజ‌ర్”గా రామ్ చరణ్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంక‌ర్ డైరెక్ష‌న్ లో నటిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా మూవీ #RC15. నిన్న రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఈ మెగా మూవీ టైటిల్ “గేమ్ ఛేంజర్” ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశారు మేక‌ర్స్. ఈ సాలిడ్ పోస్టర్స్ ని చరణ్ కూడా తన సోషల్ మీడియాలలో కూడా అప్ లోడ్ చేశాడు. అయితే, ఈ పోస్ట‌ర్ టాలీవుడ్ లోనే ఫాస్టెస్ట్ ఎవర్ రికార్డును నెలకొల్పినట్టుగా తెలుస్తుంది.

టాలీవుడ్ లో ఫ‌స్ట్ లుక్ కి పోస్ట‌ర్ రిలీజ్ అయిన 24 గంటలలోపు లక్ష లైక్స్ సాధించిన ఘ‌న‌త‌ చరణ్ సొంతం చేసుకున్నాడు. ఇన్‌స్టాలో ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్స్ (5గం), ట్విట్టర్‌లో ఫాస్టెస్ట్ 1 మిలియన్ వ్యూస్ (12గం), ట్విట్టర్‌లో 23గం.లో ఫాస్టెస్ట్ 100K లైక్‌లను సంపాదించిన రికార్డ్ ఇప్పుడు చ‌రణ్ సొంతం. దీంతో టైటిల్ కి తగ్గట్టుగానే రియల్ గేమ్ ఛేంజర్ అంటూ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు చ‌ర‌ణ్ ఫ్యాన్స్. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్న ఈ సినిమాలో చ‌ర‌ణ్ కి జంట‌గా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే థమన్ సంగీతం అందిస్తుంన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement