Friday, April 26, 2024

అజయ్ దేవగన్ లుక్ అదిరిపోయింది… ఇక అరుపులే

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ ఆర్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపించబోతున్నారు. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరి పాత్రలకు సంబంధించిన వీడియోలను రిలీజ్ చేసి సినిమాపై అంచనాలను పెంచారు రాజమౌళి.

ఇక మరోవైపు ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కూడా నటిస్తున్నారు. కాగా ఈ రోజు అజయ్ దేవగన్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ మోషన్ పోస్టర్ లో ఎప్పుడు కనిపించని విధంగా అజయ్ దేవగన్ కనిపించారు. ఇక అజయ్ సరసన సీనియర్ హీరోయిన్ శ్రియ నటిస్తోంది. కాగా ఈ చిత్రం అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement