Friday, April 19, 2024

పుష్పపై అదిరిపోయే గాసిప్ ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా కనిపించబోతున్నాడు అల్లుఅర్జున్. స్టార్ హీరోయిన్ రష్మీక బన్నీ సరసన నటిస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో సుకుమార్ బన్నీ కాంబినేషన్ లో ఆర్య ఆర్య2 సినిమాలు ఎలా తీసారో… ఇప్పుడు పుష్ప కూడా రెండు పార్టులుగా తీయనున్నారని తెలుస్తోంది. అయితే పుష్ప మాత్రం ఒకటే కథ సింకప్ లోఉంటుందట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు రావట్లేదు. దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement