Friday, April 26, 2024

రేపు 7 సినిమాలు విడుదలకు సిద్ధం..

కరోనా కష్టకాలం నుంచి సినిమా పరిశ్రమ ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ప్రతి శుక్రవారం అడపాదడపా సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ వారం అంటే సెప్టెంబర్ 17న కూడా దాదాపు 7 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. గల్లీ రౌడీ, మాస్ట్రో, హర్భజన్ సింగ్, యాక్షన్ కింగ్ ‘ఫ్రెండ్ షిప్’, ‘జెమ్’, ‘ప్లాన్ బి’, ‘హనీ ట్రాప్’, విజయ్ ఆంటోనీ ‘విజయ రాఘవన్’ రేపు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే అందులో కొన్ని థియేటర్ లో విడుదలవుతుండగా మరికొన్ని సినిమాలు ఓటీటీలో విడదలవుతున్నాయి. దాంతో ఈ వీక్ టాలీవుడ్ వార్ ఓటిటినా ? థియేటరా ? అన్నట్టుగా మారింది. మరి ఇందులో విజేతగా థియేటర్ నిలుస్తుందా ? ఓటిటినా ? అనేది తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.

“గల్లీ రౌడీ”, “మాస్ట్రో”. ఈ రెండు సినిమాలపై మంచి హైప్ ఉంది. ముఖ్యంగా “మాస్ట్రో”. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన “అంధాదున్” సినిమాకు రీమేక్ గా రూపొందిన ఈ సినిమా ఓటిటి వేదికగా విడుదల కానుంది. ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈరోజు రాత్రి 12:00 గంటల నుండి ప్రసారం కానుంది. సినిమాకు నభా నటేష్, తమన్నా గ్లామర్ హైలెట్. మరోవైపు సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న “గల్లీ రౌడీ”. ఈ సినిమాపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. నేహాశెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్.

ఇది కూడా చదవండి: నైట్ షూటింగ్ లో చిరు, చరణ్..

Advertisement

తాజా వార్తలు

Advertisement