Saturday, April 20, 2024

ఈ నెల 24న‌ థియేట‌ర్ల‌లో “7 డేస్‌ 6 నైట్స్” .

నిర్మాతగా పలు చిత్రాలు అందించిన ఎం.ఎస్‌. రాజు దర్శకునిగా ‘డర్టీ హరి’తో గతె ఏడాది సక్సెస్‌ అందుకున్నారు. తాజాగా, ఆయన దర్శకత్వం వహించిన మరో చిత్రం ‘7 డేస్‌ 6 నైట్స్‌’ ఈనెల 24న విడుదలవుతోంది. ఈ మూవీలో సుమంత్‌ అశ్విన్‌ హీరోగా, మెహర్‌ చాహల్‌ హీరోయిన్‌గా నటించారు. మరో జంటగా రోహన్‌, క్రితికా శెట్టిని పరిచయం చేస్తున్నారు. మరో ఇద్దరు అందమైన అమ్మాయిలు సుష్మ, రిషికా బాలి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని హైదరాబాద్‌, బెంగళూరు, ఉడిపి, గోకర్ణ, గోవా వంటి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించబ‌డింది.

“ఈ సినిమా కేవలం యూత్‌కి మాత్రమే కాదు.. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది. కొత్త కథలతో రావాలన్న నా కోరిక మేరకు అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నాం. అని తెలిపాడు ద‌ర్శ‌కుడు ఎం.ఎస్.రాజు. అయితే ఈ యూత్‌ఫుల్ కంటెంట్‌ సినిమా పై చాలా అంచనాలున్నాయి. పాటలు, నేపథ్య సంగీతం, మునుపెన్నడూ చూడని గోవా అందాలు, ఆద్యంతం నవ్వించే కవ్వించే సన్నివేశాలతో అందరికీ నచ్చే యూత్‌ సినిమాగా ఉండ‌నుంది అని తెలిపారు మూవీ మేక‌ర్స్.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement