Thursday, April 25, 2024

పుష్ప…తగ్గేదేలే @30 నిమిషాల వీడియో లీక్

పెద్ద సినిమా వచ్చిందంటే ఎంత హైప్ క్రియేట్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే స్థాయిలో లీకేజ్ రాయుళ్ల నుంచి బెడద కూడా ఉంటుంది. ప్రస్తుతం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది అల్లు అర్జున్ పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది.

భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ , సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఏకంగా ఇప్పుడు 30 నిమిషాల వీడియో ఒకటి లీక్ అయినట్లు తెలుస్తుంది. అలాగే కొన్ని లోకేషన్స్ ని సంబంధించిన షాట్స్ కూడా బయటకు వచ్చాయట. చిత్ర యూనిట్ దీనిపై ఎంత అలెర్ట్ గా ఉన్న లీక్ లు మాత్రం తగ్గటం లేదు. మరి చూడాలి ఎంత వరకూ ఈ లీక్ ల పర్వం కొనసాగుతుందో.

Advertisement

తాజా వార్తలు

Advertisement