Tuesday, April 16, 2024

20ఇయర్స్ ఆఫ్ ‘మురారీ’

మురారీ మూవీ రిలీజ్ అయి నేటికి ఫిబ్రవరి 17కి 20ఏళ్లు అయింది. సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటించిన అన్ని సినిమాల్లోకి మురారి చాలా ప్రత్యేకమైన సినిమా అనడంలో సందేహం లేదు. మురారి సినిమా తో మహేష్ బాబు స్టార్ హీరోగా మారిపోయాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన మురారి సినిమా లో హీరోయిన్ గా సోనాలి నటించిన విషయం తెల్సిందే. మహేష్ బాబు అభిమానులు #20YearsOfMurari హ్యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. నమ్రత కూడా ఈ సినిమా పై స్పందించారు. మహేష్ బాబు నటించిన సినిమాల్లో నాకు నచ్చిన మరో సినిమా మురారి. ఎప్పటికి ఓల్డ్ అవ్వని సినిమా మురారి. సినిమాలోని ఫన్.. సంగీతం ఇంకా ఇతర విషయాలు అన్ని కూడా చాలా ప్రత్యేంగా ఉంటాయి. అలాంటి అంశాలు అన్ని కలిగి ఉన్న సినిమాలను ఇప్పుడు వస్తున్న సినిమాల్లో చూడటం కష్టం. మురారిలో మహేష్ బాబు.. సోనాలిల నటనను ఎవరు మర్చి పోలేరు. నిజమైన క్లాసిక్ కు అర్థం అంటే మురారిని చూపించవచ్చు అంటూ నమత్ర ఈ ఫొటోను షేర్ చేసింది. నమ్రత మురారి గురించి షేర్ చేసిన కొన్ని గంటల్లోనే లక్ష మందికి పైగా స్పందించి తమకు మురారితో ఉన్న అనుబంధంను గుర్తు చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement