Thursday, April 25, 2024

’18 పేజెస్’ ఫస్టు లుక్ రిలీజ్!

యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా రూపొందుతున్న మూవీ ’18 పేజెస్’. ‘వినాయక చవితి’ పండుగ సందర్భంగా అనుపమ పరమేశ్వరన్ పాత్రను పరిచయం చేస్తూ ఫస్టులుక్ ను మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో ‘నందిని’ పాత్రలో అనుపమ కనిపించనుంది. తన చేతిపై వాలిన అందమైన సీతాకోకచిలుకను చూస్తూ అనుపమ మురిసిపోయే ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై అగ్ర నిర్మాత అల్లు అరవింద్ తో కలిసి బన్నీవాసు నిర్మించిన ఈ సినిమాకి పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి డైరెక్టర్ సుకుమారే కథ అందిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement