Wednesday, April 24, 2024

48 గంటల్లో 100 మిలియన్ వ్యూస్.. ఒటీటీలో దూసుకుపోతున్న దుల్కర్ మూవీ ‘చుప్’

మలయాళీ సూపర్ స్టా్ర్ దుల్కర్ సల్మాన్ తెలుగు ఆడియన్స్ కు సుపరిచితమే. సీతారామం లాంటి రోమాంటిక్ లవ్ స్టోరీతో సూపర్ హిట్ అందుకుని పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక సీతారామం తర్వాత దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా చుప్: రివేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్. లవ్ జోన‌ర్‌లో వ‌చ్చిన ఈ సినిమా తరువాత డైరెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ సిినిమాతో యాక్టింగ్ లో వేరియేషన్స్ చూపిస్తున్నారు దుల్కర్ సల్మాన్. కాగా, ఈ మూవీ ఈ నెల 25 నుంచి జీ5లో తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, త‌మిళ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ మూవీలో బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ ప్రత్యేక పాత్ర‌లో న‌టించారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. ఒటీటీలో రిలీజ్ అయిన 48 గంట‌ల్లో 100 మిలియ‌న్ వ్యూస్ రాబ‌ట్టుకోవ‌ట‌మే అందుకు సాక్ష్యం. గురుద‌త్‌కి నివాళిగా రూపొందించిన ‘చుప్: రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’ అనే మూవీ సినిమా విమర్శకులను లక్ష్యంగా చేసుకున్న సైకోపాత్ కిల్లర్ కథాంశమే ఇది. ఈ సినిమా మీడియా మరో కోణాన్ని ప్రపంచానికి వివరించింది.

https://twitter.com/SureshK12039097/status/1597436059029188608
Advertisement

తాజా వార్తలు

Advertisement