Tuesday, March 26, 2024

టాలీవుడ్ లో 100 కోట్ల బిజినెస్ @ ఏప్రిల్

కరోనా మహమ్మారి కారణంగా గతేడాది రిలీజ్ కావాల్సిన చిత్రాన్నీ ఈ ఏడాది ఒక్కసారిగా థియేటర్ లో సందడి చేస్తున్నాయి. ఇక ఏప్రిల్ లో చూసుకుంటే టాలీవుడ్ లో వరుస సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఏప్రిల్ 2న అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కుతున్నవైల్డ్ డాగ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే తమిళ స్టార్ హీరో కార్తీ హీరోగా తెరకెక్కిన సుల్తాన్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా రిలీజ్ కి సరిగ్గా వారం తర్వాత ఏప్రిల్ 9న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఇది వరకు విడుదలైన ట్రైలర్ సైతం సోషల్ మీడియా ని షేక్ చేసింది. కనీవినీ ఎరుగని రీతిలో రికార్డు బద్దలు కొట్టింది.

అలాగే మరో వైపు అక్కినేని నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ చిత్రం ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే సాయి పల్లవి కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచింది. గతంలో శేఖర్ కమ్ముల సాయిపల్లవి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా సాధించిన చెప్పనవసరం లేదు ఇప్పుడు. నాగచైతన్య కూడా తోడవడంతో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక బిజినెస్ విషయానికి వస్తే ఏప్రిల్ నెలలో టాలీవుడ్ లో 100 కోట్ల వరకు బిజినెస్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వకీల్ సాబ్ సినిమా కు ఉన్న క్రేజ్ దృష్ట్యా మొదటి వారం కలెక్షన్స్ భారీగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తం ఓవరాల్ గా 100 కోట్ల వరకు బిజినెస్ జరిగే పరిస్థితి కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement