Friday, March 29, 2024

హ్యాపీ బర్త్ డే ‘శివ కందుకూరి’.. ‘మను చరిత్ర’ ఫస్ట్ లుక్

నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి బర్త్ డే గిఫ్ట్ గా మను చరిత్ర ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఆ వివరాలు.  ఈ రోజు ఫిబ్రవరి 18న  శివ బ‌ర్త్‌డే కావ‌డంతో చిత్రం నుండి ఆయ‌న లుక్ ఒక‌టి విడుద‌ల చేశారు. ఇందులో శివ కందుకూరి గుబురు గ‌డ్డంతో నోట్లో సిగ‌రెట్‌, చేతిలో పువ్వు ప‌ట్టుకొని సీరియ‌స్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. పోస్ట‌ర్‌లో శివ‌ను చూస్తుంటే అర్జున్ రెడ్డి సినిమా గుర్తుకు రావ‌డం ఖాయం.మ‌ను చరిత్ర చిత్రాన్ని  యాపిల్ ట్రీ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తుండ‌గా, ఈ చిత్రానికి కాజ‌ల్ స‌హా నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం విశేషం. ఈ సినిమా త‌ర్వాత కాజ‌ల్ నిర్మాత‌గాను రాణించ‌నుంద‌నే టాక్ వినిపిస్తుంది. మ‌ను చిరిత్ర చిత్రంలో మేఘా ఆకాశ్ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, గోపి సుంద‌ర్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement