Saturday, April 20, 2024

సుధీర్ బాబు14..మరో క్రేజీ లవ్ స్టోరీతో

హీరో సుధీర్ బాబు మరో కొత్త కథతో ప్రేక్షకులను అలరించనున్నారు. దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్ లో ఓ క్రేజీ ప్రేమకథా చిత్రం తెరకెక్కుతోంది.  ముందే చెప్పినట్టుగానే తాజాగా కొత్త మ్యాటర్ తో ముందుకొచ్చారు సుధీర్. ప్రేమకథలు నచ్చిని మనుషులుండరేమో కదా అంటూ స్ట్రెయిట్ గా మ్యాటర్ కి వచ్చేసిన సుధీర్ మే బి ప్రేమలేని జీవితం ఉండదు కదా..అంటూ తన సినిమాలో కంటెంట్ ఏంటో తెలివిగా చెప్పేశారు. మార్చి 1న టైటిల్ ని లాంచ్ చేస్తున్నాం. నా ఫేవరెట్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ఈ మూవీ వస్తోంది అంటూ ఈ వీడియోలో చెప్పారు సుధీర్ బాబు. ఇది మొదటిసారి ప్రేమకథను చెప్పే యువకుల అనుభవం అంటూ సుధీర్ అన్నారు. నాలాంటి అబ్బాయి తను ప్రేమించిన అమ్మాయి గురించి మొట్టమొదటిసారి చెప్పాల్సి వచ్చినప్పుడు ఎలా మొదలు పెడతారు..ఇంట్రెస్టింగ్ కదా. అయితే ఒకసారి అబ్బాయిలంతా ఆ సరదా విషయాన్ని గుర్తు చేసుకోంది. మాతో కాంటెస్ట్ లోకి రండి అని కోరారు.కృతిశెట్టి ఈ ప్రేమకథా చిత్రంలో హీరోయిన్. పీజీ విందా..వివేక్ సాగర్ లాంటి ఇండస్ట్రీ టాప్ టెక్నీషియన్లు ఈ మూవీకి పని చేస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement