Friday, March 29, 2024

సిల్క్ స్మిత పాత్రలో ‘శ్రీరెడ్డి’

దివంగత నటి..శృంగార తార సిల్క్ స్మిత బయోపిక్ మరోసారి తెరకెక్కనుంది.బాలీవుడ్ లో 2011లో సిల్క్ స్మిత బయోపిక్ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో సిల్క్ స్మిత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ  విద్యాబాలన్ నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అయితే.. తాజాగా మరోసారి సిల్క్ స్మిత జీవితం తెరపై కనిపించబోతోంది. డైరెక్టర్ మధు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. వివాదాస్పద నటి శ్రీరెడ్డి సిల్క్ స్మిత పాత్రలో మెరవనుందట.. ఈ విషయాన్ని శ్రీరెడ్డే స్వయంగా తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ప్రకటించింది. కొన్ని రోజులుగా గుడ్ న్యూస్ చెబుతానంటూ ఫ్యాన్స్ ను ఊరిస్తున్న ఆమె.. తాజాగా ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. సిల్క్ స్మిత బయోపిక్ చేస్తున్నానని మీ ఆశీర్వాదాలు కావాలని ఆమె పోస్టు చేశారు. ఈ చిత్రం తెలుగు తమిళం భాషల్లో రిలీజ్ కానుంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తానని ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement