Thursday, April 25, 2024

సలార్ లో ‘ప్రభాస్’ లుక్ లీక్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సలార్ చిత్రం నుండి ఓ ఫొటో లీక్ అయింది.  తెలంగాణలో మొన్నటి వరకు సలార్ షూటింగ్ జరిగింది. ఈ సినిమాను సంక్రాంతి 2022కి విడుదల చేయాలని చూస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. దానికి తగ్గట్లుగానే షూటింగ్ జరుగుతుంది కూడా. ఇదిలా ఉంటే సలార్ ఫస్ట్ షెడ్యూల్ అప్పుడే పూర్తయిపోయింది. తెలంగాణ పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఆర్జీ3 పరిధిలో సలార్ షూటింగ్ జరిగింది. ఈ షూటింగ్ కు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు మరో ఫోటో కూడా లీక్ అయింది. బుల్లెట్ పై ప్రభాస్ కూర్చున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వచ్చింది. ఫోటోలు లీక్ కావడంతో దర్శక నిర్మాతలు కూడా షాక్ అయిపోయారు. వాటిని తొలగించాలని ప్రయత్నించినా కూడా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బొగ్గు గని కార్మికుల నేపథ్యంలో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ సినిమా షెడ్యూల్ పూర్తి అయిపోయినట్లు ఈ మధ్యే చిత్ర దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ షెడ్యూల్‌లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేసాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ నటిస్తుంది. అక్టోబర్ లోపు షూటింగ్ పూర్తి చేస్తామని ప్రకటించాడు ప్రశాంత్ నీల్. ఫిబ్రవరి మూడో వారంలో రెండో షెడ్యూల్ మొదలు కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement