Thursday, March 28, 2024

వరుణ్ పూజాల ఎల్లువచ్చి గోదారమ్మ సాంగ్ మరో రికార్డ్

హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం గద్దల కొండ గణేష్. ఈ సినిమాలో వరుణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ ని సాధించింది. అలాగే ఈ సినిమాలో అలనాటి తార శ్రీదేవి, శోభన్ బాబుల ఎల్లువచ్చి గోదారమ్మ పాటను రీమేక్ చేశారు. అయితే ఒరిజినల్ వెర్షన్ కు కె చక్రవర్తి సంగీతం అందించగా ఈ పాటకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.

అలాగే సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయిన కొద్ది రోజుల తర్వాత యూట్యూబ్ లో ఈ వీడియో సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు. 2019 నవంబర్ 1వ తారీఖున యూట్యూబ్ లో ఈ పాట రిలీజ్ అయింది. అయితే అప్పటి నుంచి కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ ఏడాదిన్నర కాలంలో ఈ పాట 100 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది. 100 మిలియన్ వ్యూస్ దక్కించుకున్న పాటల జాబితాలో చోటు దక్కించుకుంది. ఇక ఈ పాట 100 మిలియన్ వ్యూస్ జాబితాలో చేరడం పట్ల చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement