Friday, March 29, 2024

రాధే శ్యామ్ ఫస్ట్ సింగల్ వచ్చేస్తుంది ?

రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధే శ్యామ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా కు సంబంధించి ఫస్ట్ సింగిల్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే ఆ అప్డేట్ వచ్చే అవకాశం ఇప్పుడు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు ముగ్గురు సంగీత దర్శకులు సంగీతం అందిస్తున్నారు.

సౌత్ ఇండియన్ ఆల్బమ్ ను జస్టిన్ ప్రభాకరన్ హిందీ ఆల్బమ్ ను మిథున్ మరియు మనన్ భరద్వాజ్ లు కంపోజ్ చేస్తున్నారు. అయితే ఇంకొన్ని రోజులలోనే ఈ ఫస్ట్ సింగిల్ రాబోతుందట. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా త్వరలోనే ఇవ్వనున్నారట. ఇక ఫ్యాన్స్ అయితే ఈ సినిమాకు సంబంధించి సాంగ్స్ కచ్చితంగా సూపర్ సూపర్ హిట్ ను సాధిస్తాయనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement