Saturday, April 20, 2024

‘రాధేశ్యామ్’ టీజర్ అదిరింది..రిలీజ్ జులై30

జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంకు సంబంధించి తాజాగా టీజ‌ర్ విడుద‌లైంది. ఇందులో నువ్వు ఏమైనా రోమియో అనుకుంటున్నావా’ అని పూజా ప్రశ్నించగా.. ‘ఛ.. వాడు ప్రేమ కోసం చచ్చాడు. నేను ఆ టైప్‌ కాదు’ అంటూ యంగ్ రెబల్ స్టార్  ప్రభాస్‌ చెప్పిన డైలాగ్ అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది.ఈ టీజర్ ద్వారా రాధే శ్యామ్ చిత్ర రిలీజ్ డేట్ కూడా ప్ర‌క‌టించారు. జులై 30న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న ‘రాధేశ్యామ్‌’ చిత్రం. పాన్‌ఇండియా స్థాయిలో రూపొందుతుండ‌గా,  ఈ చిత్రానికి దక్షిణాదిలో జస్టిన్‌ ప్రభాకరన్‌ స్వరాలు అందిస్తున్నారు. హిందీలో మిథున్‌, మనన్‌ భరద్వాజ్‌ ద్వయం సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. అలనాటి నటి భాగ్యశ్రీ, ప్రియదర్శి, మురళీ శర్మ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement