Saturday, April 20, 2024

రాజమౌళి చేతుల మీదుగా ‘గాలిసంపత్’ ట్రైలర్

స్టార్ దర్శకుడు రాజమౌళి గాలి సంపత్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. డెరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పణ..స్క్రీన్ ప్లే. డైరెక్షన్ లో రూపొందుతోంది ఈ చిత్రం.  ఎస్.క్రిష్ణ , షైన్ స్క్రీన్స్ సంస్థ‌ క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువ‌ హీరో శ్రీ విష్ణు, ల‌వ్లీ సింగ్, రాజేంద్ర ‌ప్రసాద్ ప్ర‌ధాన‌పాత్రల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమా మ‌హా శివ‌రాత్రి కానుక‌గా మార్చి 11న విడుద‌ల కానుంది. ‘ప్ర‌తి అమ్మాయికీ డ‌బ్బున్నోడు కావాలి.. లేక‌పోతే ఫారిన్ వాడు కావాలి.. డ‌బ్బున్నోడు ఏం ఇస్తాడండీ.. డ‌బ్బే ఇస్తాడు. టైమ్ ఎక్క‌డి నుంచి ఇస్తాడు’ అంటూ హీరోయిన్ కి హీరో చెబుతోన్న డైలాగు అల‌రిస్తోంది. హీరోకి తండ్రిగా రాజేంద్ర ప్ర‌సాద్ న‌ట‌న ఆక‌ర్షిస్తోంది. 

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement