Thursday, April 25, 2024

రవితేజ కోసం ఇటలీ వెళ్లిన అనసూయ

జబర్దస్త్ కామెడీ షో తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ అనసూయ. తన అందంతో అభినయంతో అటు బుల్లితెరపై మెరుస్తూనే వెండితెర పై కూడాసందడి చేస్తుంది. ఇక ప్రస్తుతం అనసూయ వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది. ఇక ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖిలాడీ సినిమాలో కూడా అనసూయ నటిస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇటలీ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో అనసూయ కూడా జాయిన్ అయింది. ఇక్కడ రవితేజ పై కొన్ని యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించనున్నారట. ఆ యాక్షన్ సన్నివేశాలలో రవితేజ తో పాటు అనసూయ కూడా నటించనుందట. అందుకే అనసూయ ఇటలీ కి వెళ్లినట్లు తెలుస్తోంది. తాజాగా హలో మిలాన్ అంటూ అనసూయ ఓ ఫోటోని పోస్ట్ చేసింది. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement