Friday, April 26, 2024

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ నుండి గుచ్చే గులాబీలా సాంగ్

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం నుండి గుచ్చే గులాబీలా సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్.  ఈ చిత్రంలో అఖిల్ హీరోగా నటిస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్నాడు.  జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అఖిల్ జోడీగా యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే  న‌టించింది. జూన్ 19న చిత్ర విడుద‌ల‌కు మేక‌ర్స్ ప్లాన్ చేస్తుండ‌గా, ఈ క్ర‌మంంలో ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు వేగ‌వంతం చేశారు. ప్రేమికుల రోజు కానుకగా మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుంద‌ర్ ట్యూన్ చేసిన రొమాంటిక్ సాంగ్‌ ‘గుచ్చే గులాబీలాగా పాట‌ను కొద్ది సేప‌టి క్రితం విడుద‌ల చేశారు. ఈ పాట‌కు అనంత శ్రీరామ్, శ్రీమ‌ణి లిరిక్స్ అందించ‌గా, అర్మాన్ మాలిక్ ఆల‌పించారు.  ఈ పాట సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement