Friday, March 29, 2024

మార్చి 5న ‘షాదీ ముబారక్’

మార్చి 5న షాదీ ముబారక్ చిత్రం రిలీజ్ కానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై రూపొందిన ఔట్‌ అండ్‌ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రమిది. వీర్‌సాగర్‌, దృశ్యా రఘునాథ్‌ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి పద్మ శ్రీ దర్శకత్వం వహించగా సక్సెస్‌ఫుల్‌ చిత్రాల నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్‌  నిర్మించారు. మార్చి 5న చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది.ఈ చిత్రానికి సంబంధించిన ఇటీవల విడుదలైన ఫ‌స్ట్ లుక్‌కు మంచి స్పంద‌న వ‌చ్చిందని, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా ఈ చిత్రం ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రధానంగా తెరకెక్కిందని మేకర్స్‌ చెబుతున్నారు. త్వరలోనే ‘షాదీ ముబారక్‌’ ట్రైలర్‌ను విడుద‌ల చేస్తామ‌ని చిత్ర నిర్మాతలు తెలిపారు. వీర్‌సాగర్‌, దృశ్యా రఘునాథ్‌, ఝాన్సీ, హేమ, రాజశ్రీనాయర్‌, ప్రియదర్శి రామ్‌, హేమంత్‌, శత్రు, భద్రమ్‌, మధునందన్‌, అదితి, అజయ్‌ ఘోష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సునీల్‌ కశ్యప్ సంగీతం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement