Saturday, April 20, 2024

మలయాళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మృతి

ప్ర‌ముఖ మ‌ల‌యాళ సంగీత ద‌ర్శ‌కుడు  ఇస్సాక్ థామస్ కొట్టుకపల్లి (72)  గుండెపోటు కారణంగా  చెన్నైలో తుది శ్వాస విడిచారు. మన్ను ద్వారా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన  థామస్‌ మలయాళంతో పాటు హిందీ, కన్నడ, తమిళ చిత్రాలకు సంగీతం అందించారు. కొడైకెనాల్‌లోని అమెరికన్ టీచర్స్ స్కూల్ నుండి సంగీత కోర్సు పూర్తి చేసిన తరువాత, లండన్‌లోని ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్‌లో పియానోలో సిక్త్‌ గ్రేడ్‌ సాధించారు.థామ‌స్ మృతిపై   కేరళ సాంస్కృతిక మంత్రి ఎకె బాలన్ సంతాపం ప్రకటించారు. ఆయన లేని లోటు తీరనిది అంటూ మంత్రి ఎకె బాలన్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. థామ‌స్ మృతిపై సినీ ఇండ‌స్ట్రీకు సంబంధించిన ప‌లువ‌రు ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు. సినీ పరిశ్రమలోని వివిధ రంగాలల్లో సేవలు అందించిన థామ‌స్  జాతీయ, రాష్ట్ర అవార్డులను గెలుచుకున్నారు.  భావం (2002), మార్గం (2003), సంచరం అండ్‌ ఒరిడామ్ (2004) అనే నాలుగు చిత్రాలకు  గాను ఉత్తమ నేపథ్య సంగీతానికి స్టేట్ ఫిల్మ్ అవార్డులను కూడా అందుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement