Thursday, April 18, 2024

బెల్లంకొండ శ్రీనివాస్ 10వ చిత్రం.. ఎనౌన్స చేసిన మేక‌ర్స్

ద‌ర్శ‌కుడు సాగ‌ర్ కే చంద్ర కొత్త ప్రాజెక్ట్ ని ఎనౌన్స్ చేశాడు.ఈ చిత్రంలో హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ న‌టించ‌నున్నాడు. భీమ్లానాయ‌క్ త‌ర్వాత ద‌ర్శ‌కుడు సాగర్‌ కే చంద్ర మళ్లీ కొత్త ప్రాజెక్ట్‌ ఏమీ ప్రకటించలేదు.కాగా యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో సాగర్ కే చంద్ర సినిమా చేయబోతున్నాడంటూ ఇప్పటికే ఇండస్ట్రీ సర్కిల్‌లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.ఈ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది. బెల్లంకొండ శ్రీనివాస్‌ 10వ సినిమాగా వస్తున్న BSS10 ప్రాజెక్ట్‌ను ప్రకటించారు మేకర్స్‌. 14 రీల్స్ ప్లస్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామనవమి శుభాకాంక్షలతో టాలెంటెడ్‌ దర్శకుడు సాగర్‌ కే చంద్ర డైరెక్షన్‌లో వస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ అని రామ్‌ ఆచంట అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను అందరితో పంచుకున్నారు. ఈ చిత్రంలో ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో ఎవరు కనిపించబోతున్నారు.. ఇతర నటీనటులెవరనే దానిపై రాబోయే రోజుల్లో క్లారిటీ ఇవ్వనుంది టీం. కాగా బెల్లంకొండ శ్రీనివాస్ తో ఛ‌త్ర‌ప‌తి మూవీని హిందీలో తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రం కంప్లీట్ అయ్యాక ఈ మూవీ షూటింగ్ లో పాల్గొన‌నున్న‌ట్లు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement