Thursday, April 18, 2024

బెల్లంకొండ @వివి వినాయక్…మరో బాధ్యత

బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ ను ప్రారంభించి చాలా ఏళ్లు అవుతున్నా సరైన హిట్ అందుకోలేకపోయాడు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగు లో సూపర్ డూపర్ హిట్ సాధించిన చత్రపతి సినిమాను హిందీ రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇదిలా ఉండగా మరోవైపు తమిళంలో నటించిన కర్ణన్ సినిమా రీమేక్ రైట్స్ కూడా బెల్లంకొండ తీసుకున్నారు. అయితే ఇటీవల చత్రపతి రీమేక్ సినిమాకోసం వేసిన సెట్ వర్షం కారణంగా దెబ్బతింది.

ఈ నేపథ్యంలోనే షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. కాగా ఇప్పుడు కర్ణన్ రీమేక్ ని స్టార్ట్ చేయాలని బెల్లంకొండ ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఈ రీమేక్ బాధ్యతను కూడా వి.వి.వినాయక్ చేతిలో పెట్టాలని అనుకుంటున్నాడట బెల్లంకొండ. ఇది ఫినిష్ అయ్యాక హిందీ ప్రాజెక్ట్ మీద కు వెళ్లాలని కూడా ప్లాన్ చేస్తున్నాడట. మరి ఈ రీమేక్ ఆఫర్ ను వివి వినాయక్ తీసుకుంటాడో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement