Wednesday, April 24, 2024

‘బిబి3’ నైజాం, వైజాగ్ హక్కులు రూ.16కోట్లకు

మాస్ డైరెక్టర్ బోయపాటి శీను హీరో బాలకృష్ణతో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.  మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ద్వారకా క్రియేషన్స్ ప‌తాకంపై యంగ్ ప్రొడ్యూస‌ర్‌ మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి నటసింహ నందమూరి బాలకృష్ణ పుట్టిన‌రోజు కానుక‌గా రిలీజ్ చేసిన బీబీ3 ఫస్ట్‌ రోర్‌ ఏ విధంగా గర్జించిందో అందరికీ తెలిసిందే. ఈ ఫస్ట్‌ రోర్‌ తర్వాత సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. రీసెంట్‌గా ఈ చిత్రాన్ని మే 28న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌ చేస్తున్నట్లుగా మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. రిలీజ్‌ డేట్‌ ప్రకటించడంతో.. చిత్ర బిజినెస్‌ విషయంలో కూడా ఊపు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి నైజాం, వైజాగ్‌ హక్కులు అమ్ముడైనట్లుగా ఎక్స్‌క్లూజివ్‌ సమాచారం. ‘బీబీ3’ చిత్ర నైజాం, వైజాగ్‌ హక్కులను సక్సెస్‌ఫుల్‌ చిత్రాల నిర్మాత, స్టార్‌ డిస్ట్రిబ్యూటర్‌ దిల్ రాజు రూ.16 కోట్లకు సొంతం చేసుకున్నట్లుగా సమాచారం. మరో వైపు బాలయ్యతో పాటు మే 28న ‘ఖిలాడి’ రవితేజ కూడా వస్తున్నాడు. దీంతో బాక్సాఫీస్‌ వద్ద పోటీ వాతావరణం నెలకొనే అవకాశం లేకపోలేదు. అయినా కూడా బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌ అంటేనే తిరుగులేని కాంబినేషన్‌. ఈ కాంబినేషన్‌కి ఉన్న క్రేజ్‌ ఏమిటో.. తాజాగా అమ్ముడైన హక్కులను చూస్తుంటేనే అర్థమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement