Friday, April 26, 2024

బాలయ్య తో మాటల మాంత్రికుడు ?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అలాగే అనిల్ రావిపూడి, శ్రీవాస్ వంటి దర్శకులు లైన్ లో ఉన్నారు. అయితే ఇదిలా ఉండగా ఇప్పుడు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాలక్రిష్ణ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయబోతున్నాడట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హాసిని అండ్ హారిక బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్నట్లు బాలయ్య చెప్పుకొచ్చాడు.

నిజానికి ఈ బ్యానర్ లో త్రివిక్రమ్ ఎక్కువగా సినిమాలు చేస్తూ ఉంటారు. దీనితో డైరెక్టర్ త్రివిక్రమ్ తో బాలయ్య సినిమా అని అభిమానులు ఫిక్స్ అయ్యారు. అయితే ఈ కాంబినేషన్ కోసం అభిమానులు కూడా ఎప్పటినుంచో ఎదురు చూస్తుండటంతో బాలయ్య త్రివిక్రమ్ సినిమా త్వరలోనే రాబోతుందని టాక్ నడుస్తోంది. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమాకు సంబంధించి పనులలో బిజీగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement