Saturday, April 20, 2024

‘దియా మీర్జా’ పెళ్లి పిక్స్

హీరోయిన్ దియా మీర్జా పెళ్లి ఫొటోలు వైరల్ గా మారాయి. త‌ను ప్రేమించిన వ్య‌క్తితో పెళ్లి పీట‌లెక్కింది. ఇది దియాకు రెండో పెళ్లి కొన్నాళ్ళుగా వైభ‌వ్ రేఖితో ప్రేమాయ‌ణంలో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఫిబ్ర‌వరి 15న వైభ‌వ్‌తో క‌లిసి ఏడ‌డుగులు వేసింది. ముంబైలో కొద్ది మంది స‌న్నిహితులు, శ్రేయోభిలాషుల మ‌ధ్య వీరి వివ‌వాం జరిగింది. పెళ్ళి త‌ర్వాత న్యూ క‌పుల్  మండ‌పం  బ‌య‌ట ఫొటోల‌కు ఫోజులిచ్చారు.  ఇందులో దియా రెడ్ సారీలో మెరిసిపోగా, వైభ‌వ్ కుర్తాలో క‌ల‌ర్‌ఫుల్‌గా క‌నపించాడు. వీరి ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.  అదితీ రావు హైద‌రి ఈ వేడుక‌లో పాల్గొన‌గా,  జూతా చుపాయి ట్రెడిష‌న్  (మండ‌పం ద‌గ్గ‌ర‌కు వెళ్లే ముందు వ‌రుడి చెప్పులు దాచ‌డం) కార్య‌క్రమంలో భాగంగా వ‌రుడు వేసుకోవాల్సిన చెప్పులు దాచిపెట్టింది. చెప్పుల‌తో దిగిన ఫొటోను అదితి త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.  ప్రస్తుతం దియామీర్జా తెలుగు చిత్రం ‘వైల్డ్‌డాగ్‌’లో కీ రోల్ చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement