Friday, March 29, 2024

‘టక్ జగదీష్’ నుండి లిరికల్ సాంగ్

నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న టక్ జగదీష్ చిత్రం నుండి ఇంకోసారి ఇంకోసారి లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. గ‌త ఏడాది వి అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన నాని ఈ ఏడాది ట‌క్ జ‌గ‌దీష్ మూవీతో అల‌రించేందుకు సిద్ధ‌మ‌య్యాడు.  నాని 26వ చిత్రంగా రూపొందుతోన్న ఈ మూవీని  షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు.  త‌మ‌న్  సంగీతం అందిస్తున్నారు.  ‘నిన్నుకోరి` వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో ఈ చిత్రం రూపొందుతుంది. ఏప్రిల్ 16న విడుద‌ల కానున్న ఈ సినిమాకు సంబంధించి ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు మొద‌లు పెట్టారు. ఇందులో భాగంగా చిత్రం నుండి “ఇంకోసారి ఇంకోసారి” అనే పాట లిరిక‌ల్ వీడియోను విడుద‌ల చేశారు. నాని, రీతు వ‌ర్మ జంట‌పై చిత్రీక‌రించిన ఈ సాంగ్ సంగీత ప్రియుల‌ని ఆక‌ట్టుకుంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement