Friday, April 19, 2024

కరోనా రోగులకు ఆర్ఆర్ఆర్ టీం హెల్పింగ్

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా కనిపించబోతున్నాడు. అయితే ఇదిలా ఉండగా కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఎంతోమంది వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు.

అలా ఇబ్బంది పడేవారికి త్రిబుల్ ఆర్ టీం ఆపన్న హస్తాన్ని అందిస్తోంది. కరోనా బారిన పడిన వారు ఏమైనా సమస్యలు ఉంటే తమను సంప్రదించవచ్చని… వారికి తగిన నివారణ చూపిస్తామని చెబుతున్నారు. కరోనా కు సంబంధించిన ప్రామాణికమైన సమాచారాన్ని ట్విట్టర్ లో ఆర్ఆర్ఆర్ అకౌంట్ లో చూడవచ్చని రాజమౌళి తెలిపారు. తమ దగ్గరకు వచ్చే సమస్యలను దాన్ని పరిష్కరించే సంబంధిత వ్యక్తులకు సంస్థలకు చేరవేసే ప్రయత్నం చేస్తామని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement