Friday, March 29, 2024

ఓటీటీలో బిగ్ బాస్ – వివ‌రాలు ఇవే

ఓటీటీలో సంద‌డి చేయ‌నుంది బిగ్ బాస్. మ‌రి బిగ్ బాస్1వ భాగం అంటారాల లేక బిగ్ బాస్6 అంటారో తెలియ‌దు. బిగ్ బాస్5 గ్రాండ్ ఫినాలే స్టేజ్ పైన హీరో నాగార్జున ఓటీటీలో మాత్ర‌మే బిగ్ బాస్ అని ఎనౌన్స్ చేశారు. ఆ త‌ర్వాత ఓటీటీ బిగ్ బాస్ ఎలా ఉండ‌నుందో ఇప్ప‌టివ‌ర‌కు ఎనౌన్స్ చేయ‌లేదు. అయితే ఇప్పుడున్న సీజన్ 5 సెట్స్ ని కాస్త మార్పులు చేర్పులు చేసి సీజన్ 1 గా చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన 15మంది సెలబ్రిటీలు ఎవరు అన్నది త్వరలోనే ప్రకటించబోతున్నారు. ఈ సీజన్ అనేది కంప్లీట్ గా ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతుంది. టెలివిజన్ ప్రేక్షకులకి వస్తుందా రాదా అనేది చూడాలి. అయితే, దీనికి నాగార్జున యాంకరింగ్ చేస్తారా ? లేదా ? అనేది మాత్రం సస్పెన్స్. అయితే, ఈ ఓటీటీ షోకి మాత్రం ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి.

మొదటి పేరు సీజన్ 1 విజేత అయిన శివబాలాజీ , అలాగే అదే సీజన్ లో ఎంటర్ టైన్ చేసిన నవదీప్. వీళ్లిద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఓటీటీలో కంటెంట్ కాబట్టి కూల్ గా వీరిద్దరే ఉండే అవకాశం ఉంది. నిజానికి హిందీలో ఓటీటీలో చేసిన బిగ్ బాస్ కి అంత ఆదరణ లభించలేదు. కరణ్ జోహార్ దీనికి యాంకరింగ్ చేశాడు. కాబట్టి, తెలుగులో ఏదైనా ప్లాన్ చేస్తారా అనేది ఆసక్తికరం. తెలుగులో ఫస్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేసిన తర్వాత మరుసటి రోజున టెలివిజన్ లో టెలికాస్ట్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే, ఈ షో అనేది ఎలా ఉండబోతోందనేది ఇప్పుడప్పుడే ఎవ్వరూ ఊహించలేరు. అంతేకాదు, బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 తర్వాత సీజన్ 6 ని కూడా వచ్చే సంవత్సరం ముందుగానే తెచ్చే అవకాశం కూడా ఉందని అంటున్నారు. జూన్, జులై నెలల్లోనే ఈ సీజన్ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement