Saturday, April 20, 2024

‘ఏ’ చిత్రంలోని సిలకా సిగురు సాంగ్

ఏ చిత్రంలోని సిలకా సిగురుసాటుకు పోకే అనే పాటని స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.థమన్ రిలీజ్ చేశారు. సైన్స్ ఫిక్ష‌న‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ ‘ఏ’ . నితిన్ ప్రసన్న హీరోగా ప్రీతి అస్రాని హీరోయిన్‌గా యుగంధ‌ర్ ముని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సైన్స్ ఫిక్ష‌న‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ ‘ఏ’. అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై  గీతా మిన్సాల ఈ చిత్రాన్ని నిర్మించారు. విజ‌య్ కురాకుల సంగీత సార‌థ్యం వ‌హించిన ఈ సినిమాలోని ‘సిలకా సిగురు సాటుకు పోకే..’ పాట‌ను మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌. థమ‌న్ విడుద‌ల చేసి సినిమా పెద్ద హిట్ కావాల‌ని యూనిట్‌కి అభినంద‌న‌లు తెలిపారు. అనంత్‌ శ్రీరామ్ రాసిన ఈ పాటను దీపు పాడారు. జానపదం స్టైల్లో సాగుతున్న ఈ పాట ప్రేకకులను ఆకట్టుకునేలా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement