Friday, March 29, 2024

ఇది కదా పవన్ అంటే..అదరగొడుతున్న స్టిల్స్..

క్రిష్ డైరెక్షన్ లో పవన్ కల్యాణ్ నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు. ఈ మూవీకి సంబంధిచి కొన్ని పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ లుక్‌ను సినిమా టైటిల్‌ను విడుదల చేసింది చిత్రబృందం. చారిత్రక వీరుడిగా పవన్ కళ్యాణ్ అదరగొట్టాడు. విడుదల చేసిన చిన్న గ్లిమ్స్‌లో పవన్ ఓ ఓడలోకి దూకినట్లుగా చూపించారు. ఈ వీడియోలో పవన్ శూలం లాంటీ ఓ ఆయుధాన్ని తిప్పుతూ కేకపెట్టిస్తాడు. దానికి సంబంధించిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ సీన్ కోసం పవన్ చేసిన రిహార్సల్స్‌కు చెందిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

స్టంట్ డైరెక్టర్ శ్యామ్ కౌశల్ పర్యవేక్షణలో హర్ష్ వర్మ అనే షావోలిన్ యోధుడితో కలిసి బల్లెం ఉపయోగించి పోరాడడంపై శిక్షణ పొందుతున్నారు. సెట్స్ పైకి చాలా త్వరగా చేరుకునే పవన్ మేకప్ కంటే ముందే ఉదయం 7 గంటల నుంచి ఈ తరహా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకుంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement