Thursday, March 28, 2024

ఇంట్రెస్టింగ్ గా ‘ఏ’ రాపిడ్ ట్రైలర్

దర్శకుడు యుగంధర్ ముని తెరకెక్కిస్తోన్న చిత్రం ఏ. ఈ మూవీలో నితిన్ ప్రసన్న..ప్రీతి అస్రాని జంటగా నటిస్తున్నారు. అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై గీతా మిన్సాల నిర్మించిన చిత్రం ఇది. డిఫరెంట్ థ్రిల్లర్ చిత్రంగా రూపొందింది. తాజాగా ‘ఏ’ చిత్రానికి సంబంధించిన రాపిడ్ కట్ ట్రైలర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘యుద్ధానికి కావాల్సింది గమ్యం.. అది తిరిగిరాలేనిదైనా నాకు సంతోషమే..’ అంటూ ఇంటెన్స్ డైలాగ్‌తో మొదలైన ఈ ట్రైలర్.. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. అంతేకాదు సినిమా ఏ రేంజ్‌లో తెరకెక్కిందో తెలిపేలా ఉంది. విభిన్న చిత్రాలను కోరుకుంటున్న ప్రేక్షకులకు ఈ చిత్రం ఫుల్ మీల్స్ ఇవ్వబోతుంది అనేలా ఈ రాపిడ్ ట్రైలర్‌ను కట్ చేశారు. ట్రైలర్ చూసిన ఎవరైనా.. ఖచ్చితంగా థ్రిల్ అవ్వడంతో పాటు సినిమా కోసం వెయిట్ చేయడం ఖాయం. ఈ తరహా చిత్రం ఈ మధ్య కాలంలో అయితే రాలేదు అనేలా ఈ ట్రైలర్ చెప్పేస్తోంది. మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాని పి.వి.ఆర్‌.పిక్చర్స్ గ్రాండ్‌గా విడుదల చేస్తుంది.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement