Saturday, April 20, 2024

అశోకవనంలో అర్జున కళ్యాణం – విశ్వక్ సేన్ నెక్స్ట్ సినిమా టైటిల్

ఫలక్ నుమా దాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు విశ్వక్ సేన్. ఈ సినిమా మంచి హిట్ ని అందుకోవడం తో పాటు నటుడిగా విశ్వక్ కు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. అలాగే యూత్ లో మంచి ఫాలోయింగ్ ని కూడా తీసుకు వచ్చింది. ఆ తర్వాత కూడా హిట్ సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్నాడు విశ్వక్. ఇక తాజాగా విశ్వక్ సేన్ తన 7వ చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ చిత్రానికి అశోకవనంలో అర్జున కళ్యాణం అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

విద్యాసాగర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇక ప్రస్తుతం విశ్వక్ సేన్ పాగల్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం లో హీరోయిన్ గా నివేద పేతురాజ్ నటిస్తోంది. నరేష్ కుప్పిలి కు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement