Tuesday, April 16, 2024

అక్కినేని, ప్రవీణ్ సత్తారు సినిమా అప్డేట్ !!

అక్కినేని నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యాక్షన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ బయట లొకేషన్స్ లలో ఎక్కువ భాగం షూట్ చేయాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా అది వీలుపడలేదు.

అయితే ఈ నేపథ్యంలోనే అన్నపూర్ణ స్టూడియోలో ఓ ప్రత్యేక సెట్ ను వేయించారు అక్కినేని నాగార్జున. అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను కూడా షూట్ చేయనున్నారు. వచ్చే నెల మొదటి వారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇక ఇందులో కాజల్ ఓ రా ఏజెంట్ గా కనిపించనున్నారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement