Wednesday, April 24, 2024

అందం..అభినయం ‘అనిఖ సురేంద్రన్’

గ్లామర్ ప్రపంచంలో హీరోయిన్ గా సెటిల్ అవ్వాలంటే అందరిని ఆకట్టుకునే యాక్టింగ్ అయినా బాగా తెలిసివుండాలి, అందరిని ఆకర్శించే అందం అయినా ఉండాలి భామలకు. రెండు ఒకే అమ్మాయిలో ఉంటే ఆ అమ్మాయి రేంజ్ ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ .. మలయాళ ఫిల్మ్ ఇండస్ట్ర లలో అయితే హీరోయిన్స్ అందం కంటే కూడా ఎక్కువుగా అభినయం చూస్తారు మేకర్స్. అక్కడ టీనేజ్ ప్రేమకథలు కూడా ఎక్కువగా వస్తుంటాయి. అండ్ అక్కడ సినిమాను థియేటర్ లోనే చూడటం, అది కూడా ప్రతి వారం ఒక న్యూ ఏజ్ లవ్ స్టోరీ విడుదల అవుతుండటం వలన సహజ నటీమణులకు, రియలిస్టిక్ కథలకు అక్కడ ఇప్పుడు బాగా డిమాండ్ పెరిగింది. ఇప్పుడు తమిళ.. మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ లలో టీనేజ్ లవ్ స్టోరీస్ అనగానేమేకర్స్ కి ముందుగా గుర్తొచ్చే హీరోయిన్ ‘అనిఖ సురేంద్రన్’. ఇప్పుడు ఇక్కడ ఈ అమ్మాయి పేరు, ఈ అమ్మాయి డేట్స్ బాగా బిజీ అంటున్నారు. అమ్మడి డేట్స్ కావాలి అంటే నెలలు తరబడి వెయిట్ చేయాలంట. ఇప్పుడు ఈ అమ్మాయి తాజాగా తెలుగులో కూడా బిజీ కానుంది. ప్రవీణ్ సత్తారు నెక్స్ట్ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో అనిఖా ఒక మంచి రోల్ లో నటించనుంది అని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement