Monday, December 6, 2021

వకీల్ సాబ్ ట్రైలర్ పై రేణు దేశాయ్ రియాక్షన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం వకీల్ సాబ్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ సోషల్ మీడియా లో రికార్డ్స్ పరంపరను కొనసాగిస్తోంది. ఈ ట్రైలర్ పై పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ స్పందించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చాలా కొత్తగా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారని… ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని సరికొత్త లుక్ లో ఉన్నారని అన్నారు.

అమ్మాయి తరఫున వాళ్ల కోసం పోరాడే ఓ లాయర్ పాత్రలో పవన్ నటన చాలా బాగుందని ప్రశంసించారు. పవన్ యాటిట్యూడ్ సినిమాలో అదిరిపోయిందన్నారు. అబ్బాయిని మీరు వర్జినా అంటూ చివరలో ప్రశ్నించడం బాగుందని… మొదటి నుండి చివరి వరకు కూడా ట్రైలర్ ఆసక్తిగా ఉందని రేణు దేశాయ్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News