Wednesday, May 19, 2021

‘రణవీర్ షోరే’కి కరోనా

బాలీవుడ్ నటుడు రణవీర్ షోరేకి కరోనా పాజిటివ్ అని తేలింది. తనకు జరిపిన పరీక్షల్లో కరోనా సోకిందని వెల్లడైందని నటుడు రణవీర్ షోరే తాజాగా ట్వీట్ చేశారు. తనకు స్వల్ప కరోనా లక్షణాలున్నాయని, పరీక్షల్లో పాజిటివ్ అని రావడంతో క్వారంటైన్ లో ఉన్నానని రణవీర్ షోరేకు ట్వీట్ చేశారు. కరోనా బారిన పడిన నటుడు రణవీర్ షోరే త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుతూ ట్వీట్లు పెట్టారు. కరోనా నుంచి బయటపడేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. రణవీర్ షోరే అంగ్రేజీ మీడియం, లూట్ కేస్, కడఖ్ సినిమాల్లో నటించారు. హై, పరివార్ వెబ్ సిరీస్ లోనూ ఈయన నటించారు.

'రణవీర్ షోరే'కి కరోనా
Advertisement

తాజా వార్తలు

Prabha News