Saturday, June 12, 2021

చిరు ఆక్సిజన్ బ్యాంక్ కాపాడిన ప్రాణం

కరోనా కష్టకాలంలో ఎంతో మంది సినీ ప్రముఖులు పేద ప్రజలకు సహాయం చేస్తున్నారు. అలాగే సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి ఆక్సిజన్ అందక ఇబ్బందులు పడుతున్న ఎంతోమందికి అండగా నిలిచారు. ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్నారు. 24×7 కరోనా రోగులకు సరఫరా చేస్తూ అండగా నిలుస్తున్నారు.

30 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ బ్యాంకులను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల శ్రీకాకుళం జిల్లా రాజాం ప్రాంతంలో కరోనా సోకిన ఓ న్యాయవాదికి మిడ్ నైట్ లో ఆక్సిజన్ అవసరమైంది. అప్పటికే ఉన్న సిలిండర్ అయిపోగానే వెంటనే రీప్లేస్ చేసేందుకు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ని సంప్రదించారట. అయితే అంత అర్థరాత్రి సమయంలో కూడా ట్రస్ట్ సేవికులు ఆక్సిజన్ సిలిండర్ ని హుటాహుటీన అందించి ప్రాణాలను కాపాడారు. ఇక ఇదే విషయమై నెటిజన్స్ సైతం చిరు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News