Monday, October 18, 2021

అఘోరాగా ‘బాలయ్య’

హీరో బాలకృష్ణ అఘోరాగా మారనున్నాడు.ఈయన నటిస్తున్న సినిమాలో అఘోరా పాత్ర చేస్తున్నాడని దర్శకుడు బోయపాటి కూడా ఖరారు చేసాడు. ఈ పాత్రపై సెపరేట్ ఫోకస్ చేస్తున్నాడు ఈ దర్శకుడు. ప్రస్తుతం BB3 షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. అక్కడే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు బోయపాటి. ఈ సినిమాలో ఇంటర్వెల్ టైమ్‌కు అఘోరా పాత్ర ఎంట్రీ ఇస్తుందని తెలుస్తుంది. అక్కడ్నుంచి అఘోరాగా బాలయ్య చేసే అద్భుతాలు చూడాల్సిందే కానీ చెప్పలేం అంటున్నారు మేకర్స్. పక్కా కమర్షియల్ మాస్ ఫార్ములాతోనే వస్తున్న ఈ సినిమాలో అఘోరాగా ఉండే పాయింట్ బోయపాటి ఎక్కడ పెట్టాడో తెలియదు కానీ దానిపై మాత్రం నందమూరి అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.  ఈ సినిమాలో డబుల్ రోల్ చేస్తున్నాడు బాలయ్య. ఈ రెండు పాత్రల కోసం ఫిజికల్‌గానూ చాలా కష్టపడ్డాడు నందమూరి నటసింహం. ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో ఆర్ఎఫ్‌సీలో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. అఘోరా పాత్ర ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి చివరి వరకు కూడా సినిమా రేంజ్ మరో స్థాయిలో ఉంటుందని తెలుస్తుంది. మరి ఇంతటి అంచనాలు పెంచేస్తున్న బోయపాటి.. సినిమాలో ఎలా చూపించబోతున్నాడనేది మరింత ఆసక్తికంగా మారిపోయింది.

అఘోరాగా 'బాలయ్య'
Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News