Thursday, April 25, 2024

ముడిచమురుపై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌పెంపు

దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న క్రూడాయిల్‌పై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ను కేంద్ర ప్రభుత్వం పెంచింది. అదే సమయంలో డీజిల్‌ ఎగుమతిపై పన్నును తగ్గించింది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఒఎన్‌జిసి ఉత్పత్తిచేసే ముడి చమురుపై పన్నును టన్నుకు రూ.9,500 నుంచి రూ. 10,200కి పెంచింది. ఈపెంపు గురువారం నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. ప్రతి 15 రోజులకు విండ్‌ఫాల్‌ పన్నులో సవరణ జరుగుతుంది. ప్రభుత్వం కూడా డీజిల్‌ ఎగుమతి రేటును లీటరుకు రూ.13 నుంచి 10.50కి తగ్గించింది. డీజిల్‌పై విధించే పన్నులో లీటర్‌కు రూ.1.5 రోడ్డు మౌలిక సదుపాయాల సెస్‌ కూడా ఉంది. అయితే జెట్‌ ఇంధనంపై ఎగుమతి పన్ను మాత్రం మారలేదు. ఇది రూ.5 వద్ద స్థిరంగానే ఉంచబడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement