Thursday, April 25, 2024

తగ్గిన హోల్‌సేల్‌ ద్రవ్యోల్బణం.. 18 నెలల కనిష్టానికి చేరిక

ఆహార పదార్ధాలు, ఇంధన, తయారీ వస్తువుల ధరలు తగ్గడంతో టోక్‌ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌ నెలలో 10.7 శాతానికి తగ్గింది. ఇది 18 నెలల కనిష్టం. ఇది ఆగస్టులో 12.41 శాతంగా ఉంది. ఇలా హోల్‌సేల్‌ ద్రవ్యోల్బణం తగ్గడం వరసగా ఇది నాలుగో నెల. తగ్గినప్పటికీ ఇంకా రెండు అంకెల్లో ద్రవ్యోల్బణం కొనసాగడం మాత్రం ఆందోళన కల్గించే అంశమే. మినరల్‌ ఆయిల్‌, ఆహార వస్తువులు, ముడి పెట్రోలియం, సహజవాయువు, రసాయనాలు, రసాయన ఉత్పత్తులు, బేసిక్‌ మెటల్స్‌, విద్యుత్‌, వస్త్రాల ధరలు పెరగడంతోనే టోకు ధరల ద్రవ్యోల్బణం రెండంకెల్లో నమోదైంది. 2022 ఆగస్టులో హోల్‌సేల్‌ ధరల సూచీ 12.41 శాతం ఉంటే, 2021 సెప్టెంబర్‌లో 1.80 శాతం ఉంది. ఈ సంవత్సరం మే నెలలో 15.88 శాతంతో రికార్డు స్థాయిలో గరిష్టాన్ని తాకింది. నిత్యవసరాల ధరలు కొంతమేర తగ్గడంతో టోకు ద్రవ్యోల్బణం క్రమంగా దిగివస్తోందిని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఆహార పదార్ధాల ధరలు ఆగస్టుతో పోల్చినప్పుడు 12.37 శాతం నుంచి 11.03 శాతానికి తగ్గాయి. కూరగాయల ధరలు మాత్రం ఆగస్టులో 22.29 శాతం నుంచి సెప్టెంబర్‌లో 39.66 శాతానికి పెరిగాయి. విద్యుత్‌ రేట్లు 33.67 శాతం నుంచి 32.61 శాతానికి తగ్గాయి. తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 6.34 శాతంగా, నూనె గింజలు 16.67 శాతంగా నమోదైంది. రిటైల్‌ ద్రవ్యోల్బణం 7.41 శాతానికి చేరిన విషయం తెల్సిందే.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement